News March 8, 2025
దిశా చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: అనంత

మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన, ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసంతో అడుగులు వేయాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం తెచ్చిన దిశ చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
Similar News
News April 11, 2026
‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’గా కళ్యాణి రాధా

అనంతపురం జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కళ్యాణి రాధా ‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు అందుకున్నారు. శుక్రవారం టెక్కలిలో జరిగిన ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మెకానికల్ విభాగాధిపతిగా, కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.
News April 10, 2026
రాయలసీమ అభివృద్ధికి జగన్ ఆటంకం: ఎంపీ

రాయలసీమకు అసలైన ద్రోహి జగన్ రెడ్డేనని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వంలో 102 ప్రాజెక్టులను రద్దు చేసి, నేడు రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.10,014 కోట్లు కేటాయించి, చరిత్ర సృష్టించిందన్నారు. 80శాతం ప్రాజెక్టులు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే నిర్మించినవని గుర్తుచేశారు.
News April 10, 2026
వైశాలి ఘోర్పడేకు ‘బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు

అనంతపురం జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే ‘బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డును అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం టెక్కలిలో జరిగే ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో ఈమెకు కాంక్రీట్ మీద చేసిన పరిశోధనలకు గాను పలు పేటెంట్లు కూడా దక్కాయి. ఇప్పటి వరకు 100కు పైగా అంతర్జాతీయ పత్రికలను, 4 పుస్తకాలను ప్రచురణ చేశారు.


