News February 4, 2025
‘దీపం పథకం 2 పటిష్ఠంగా అమలు చేయండి’
దీపం పథకం-2 పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని కోర్ట్ హాల్లో పుట్టపర్తి పరిధిలోని గ్యాస్ ఏజెంట్స్ ప్రతినిధులతో దీపం పథకం-2 సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో అర్హులైన పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు.
Similar News
News February 5, 2025
నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఈరోజు మహాకుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్కు చేరుకోనున్న పీఎం, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కాగా.. గత నెల 13న మొదలైన కుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది.
News February 5, 2025
ఓపెన్ టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
APలో టెన్త్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17-28 వరకు రోజు విడిచి రోజు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 17న హిందీ, 19న ఇంగ్లిష్, 21న తెలుగు/ఉర్దూ/కన్నడ/ఒరియా/తమిళం, 24న మ్యాథ్స్, 26న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, 28న సోషల్, ఆర్థిక శాస్త్ర పరీక్షలు నిర్వహిస్తారు. కాగా రెగ్యులర్ పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు జరుగుతాయి.
News February 5, 2025
ప్రభాస్ సినిమాలో సాయిపల్లవి?
హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో డార్లింగ్ ప్రేయసి పాత్ర కోసం సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాకే హైలైట్గా నిలిచేలా ఆ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.