News October 26, 2024
దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కోయంబత్తూరు(CBE), బరౌని(BJU) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06055 CBE- BJU ట్రైన్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 16 వరకు ప్రతి శనివారం, నం.06056 BJU- CBE ట్రైన్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 19 వరకు ప్రతిమంగళవారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News September 17, 2025
కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.
News September 17, 2025
MTM: YS జగన్ ఫొటోలతో సర్టిఫికేట్లు.. ఉద్యోగులు సస్పెండ్

బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిథిలో మాజీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పెద్దింట్లమ్మ, పంచాయతీ కార్యదర్శి రవి శంకర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 16, 2025
బందరు: జగన్ ఫోటోతో INCOME సర్టిఫికేట్ జారీ

బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారినా రాష్ట్రంలో అక్కడక్కడ జగన్ ఫోటోలతో కూడిన సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల గుంటూరులో జగన్ ఫోటోతో సచివాలయ సిబ్బంది సర్టిఫికేట్ జారీ చేయడాన్ని మరువక ముందే నేడు బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో జగన్ ఫోటోతో సర్టిఫికేట్ జారీ విమర్శలకు తావిస్తోంది.