News October 27, 2024
దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కోయంబత్తూరు(CBE), బరౌని(BJU) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06055 CBE- BJU ట్రైన్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 16 వరకు ప్రతి శనివారం, నం.06056 BJU- CBE ట్రైన్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 19 వరకు ప్రతిమంగళవారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News November 10, 2024
పామర్రు: ఈ ఆలయంలో భక్తులే పూజారులు
పామర్రు మండలం ఉండ్రపూడిలోని సువర్చలా సమేతంగా వెలసిన వీరాంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధమైంది. 40 దశాబ్దాల కిందట వెలసిన ఈ స్వామి కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు. విద్యలో రాణించడానికి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ప్రతి రోజూ ఇక్కడ విశేష అర్చనలు, మంగళ, శనివారాలు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులే పూజారులై ఈ స్వామికి అర్చనలు, అభిషేకాలు చేయటం విశేషం.
News November 10, 2024
ఏలూరు, తాడేపల్లిగూడెం వెళ్లే ప్రయాణికులకు గమనిక
ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.13351 ధన్‌బాద్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ నవంబర్ 11,12 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. నవంబర్ 11,12 తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.
News November 10, 2024
కూచిపూడి థీమ్‌తో టెర్మినల్ డిజైన్లు ఉండాలి: చంద్రబాబు
కూచిపూడి నాట్యానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గన్నవరంలో విమానాశ్రయ టెర్మినల్ డిజైన్లు కూచిపూడి థీమ్‌తో నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. శనివారం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ఆయన తన నివాసంలో సమీక్షించారు. ఈ సమీక్షలో టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ల నిర్మాణంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు.