News January 21, 2025

దీప్తి జీవాంజిని వరించిన మరో అవార్డు

image

ఇటీవల అర్జున అవార్డు అందుకున్న ఓరుగల్లు బిడ్డ దీప్తి మరో అవార్డుకు ఎంపికైంది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డుకు దీప్తి ఎంపికైనట్లు సోమవారం ప్రకటించారు. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఈనెల 26న ప్రదానం చేయనున్నారు. అవార్డులో భాగంగా రూ.2లక్షల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. కాగా, దీప్తి పర్వతగిరి మండలం కల్లెడవాసి.

Similar News

News January 22, 2025

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్‌ సీపీ

image

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త పోకడలు, మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో పాటు పిరమిడ్‌ లాంటి స్కీంల ద్వారా ప్రజల సొమ్ము దోచేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

News January 21, 2025

నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటానికి జిల్లా కేంద్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఔత్సాహిక మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

News January 21, 2025

పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ఏసీపీ దేవేందర్ రెడ్డి

image

పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ డివిజన్ పోలీస్ అధికారులతో ఏసీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చోరీలను కట్టడి చేయడం కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు.