News September 23, 2024
దీప్తి ప్రపంచానికి ఆదర్శం: మాజీ ఎమ్మెల్సీ
మానసిక సామర్థ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, విధిని ఎదిరించి తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి ప్రపంచానికి ఆదర్శమని మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండా మురళీధర్ రావు అన్నారు. అథ్లెట్ దీప్తి సోమవారం మురళీధర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దీప్తి సాధించిన కాంస్య పతకాన్ని మురళీధర్ రావు ఆమెకు అలంకరించి అభినందించారు.
Similar News
News October 10, 2024
వరంగల్: బతుకమ్మ వేడుకల్లో అపశృతి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో యాకయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా యాకయ్య మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. యాకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 10, 2024
HNK: రతన్ టాటా మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు..
నవభారత నిర్మాత, భారత పారిశ్రామిక రంగానికి మార్గదర్శి, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మరణం బాధాకరమని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచి, భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపారవేత్తగా రతన్ టాటా నిలిచారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
News October 10, 2024
హనుమకొండ జిల్లాలో విషాదం.. ఒకేరోజు తల్లి, కొడుకు మృతి
హనుమకొండ జిల్లాలో బుధవారం విషాదం నెలకొంది. వివరాలిలా.. భీమదేవరపల్లి మండలం ములుకనూరుకి చెందిన శోభ(53)కు టీబీ వ్యాధి సోకగా, కుమారుడు సాయికిరణ్(25) క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తల్లి శోభ నిన్న ఉదయం చనిపోగా, సాయికిరణ్ రెండు గంటల్లో చనిపోయాడు. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందడంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.