News April 13, 2025
దుగ్గిరాల: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

గుంటూరు (D) దుగ్గిరాల (M) చినపాలెంలో శనివారం జరిగిన విషాద ఘటన గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది. ఓ జూనియర్ కాలేజీలో CEC మొదటి సంవత్సరం చదువుతున్న అవినాశ్ (17) ఇంటర్ పరీక్షల్లో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఫలితాలు వెలువడిన వెంటనే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అవినాశ్ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News November 22, 2025
నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ సత్యసాయి(D) పుట్టపర్తికి వెళ్లనున్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉ.11 గంటలకు ముర్ము అక్కడికి చేరుకోనున్నారు. ఎయిర్పోర్టులో CM చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. మ.3.40గంటలకు రాధాకృష్ణన్ చేరుకుంటారు. సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి రాధాకృష్ణన్, చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
News November 22, 2025
పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.