News September 1, 2024

దుగ్గొండి: నీటి వరదకు కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం

image

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వరదలో మహిళ మృతదేహం కొట్టుకు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మండల వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. దీంతో మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Similar News

News December 7, 2024

వరంగల్: రేవంత్ పాలనలో జిల్లాలో కావాల్సింది ఏంటి?

image

రేవంత్ రెడ్డి CMగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన నాలుగేళ్లలో మామునూరు ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్క్ పూర్తి, పలు చోట్ల ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, పలు ఐటీ, ఇతర ఇండస్ట్రీస్‌ను తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మిగిలిన నాలుగు ఏండ్లలో ఇంకా ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో కామెంట్ చేయండి.

News December 7, 2024

ములుగు: హ్యాండ్ బాల్ పోటీలకు 12మంది ఎంపిక

image

ములుగు జిల్లా హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ బాయ్స్ ఎంపికలు నిర్వహించినట్లు హ్యాండ్ బాల్ ఇన్‌ఛార్జ్ కోచ్ కుమారస్వామి తెలిపారు. జిల్లా క్రీడల అధికారి తుల రవి హాజరై 40 మంది క్రీడాకారుల్లో 12 మందిని ఆల్ ఇండియా ఇంటర్ డిస్టిక్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక చేశారన్నారు. కాగా, వీరంతా జనవరి 27 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.

News December 7, 2024

ఇందిరమ్మ ఇళ్లపై జనగామ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కలెక్టర్ అవగాహన కల్పించారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు.