News July 19, 2024

దుత్తలూరు: మద్యం తాగి పాఠశాల గదిలో పడిఉన్న వ్యక్తి

image

దుత్తలూరు మండలం ఎరుకల్లు పాఠశాలలో మద్యం తాగి అపస్మారక స్థితిలో పడిఉన్న ఘటన శుక్రవారం జరిగింది. ఉదయం పాఠశాలకు వచ్చేసరికి గదిలో పడి ఉండడాన్ని గమనించిన విద్యార్థులు భయాందోళన చెందారు. గది తలుపులు తాళం వేసి ఉంటే ఎలా లోపలకు వెళ్లాడని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆరు బయట, ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News October 22, 2025

గుడ్లురులో ప్రమందం.. 50కి పైగా గొర్రెలు మృతి

image

గుడ్లూరు మండలంలో మంగళవారం రాత్రి నేషనల్ హైవే‌పై దారుణం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కంటైనర్ వాహనం గొర్రెల మందను ఢీ కొట్టడంతో 50కి పైగా గొర్రెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. మోచర్ల – వీరేపల్లి గ్రామాల మధ్య గొర్రెల మందను నేషనల్ హైవేపై క్రాస్ చేయిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేయనున్నట్లు గుడ్లూరు పోలీసులు తెలిపారు.

News October 21, 2025

రేపు అన్ని జూనియర్ కాలేజీలకు సెలవు

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు RIO వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 21, 2025

పురమిత్ర యాప్‌తో ఆన్లైన్ సేవలు సులభతరం

image

పురమిత్ర యాప్ ద్వారా మున్సిపల్ ఆన్లైన్ సేవలు సులభతరం అవుతాయని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్
మంగళవారం తెలిపారు. పురమిత్ర ఫోన్ యాప్ ద్వారా వివిధ రకాల టాక్స్‌లు సులభంగా చెల్లించవచ్చన్నారు. https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దీని ద్వారా ఫిర్యాదులు కూడా చేయవచ్చని పేర్కొన్నారు.