News January 26, 2025
దుద్యాల్: భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షలు, 120 గజాల ప్లాటు ఇచ్చి న్యాయం చేస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో దుద్యాల మండలం లగచర్ల రైతులు కలెక్టర్తో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి రైతుల సమ్మతి లభించిందని కలెక్టర్ తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామన్నారు.
Similar News
News November 20, 2025
వనపర్తిలో ఈనెల 22న జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 22న 10.30 గంటలకు వనపర్తిలోని రామాలయం దగ్గర ఉన్న పీఎంకేకే సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.వెంకటేశ్వర రాజు తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లు, SSC/ITI/డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి హైదరాబాద్/వనపర్తిలోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని, వివరాలకు 9848776371ను సంప్రదించాలని కోరారు.
News November 20, 2025
కృష్ణా: ఎనిమిది మంది బిల్ కలెక్టర్లకు పదోన్నతి

కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్లకు పదోన్నతి లభించింది. పలు మండలాల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్లో వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ అరుణ, ఏఓ సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
NGKL: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్షించారు.


