News January 26, 2025
దుద్యాల్: భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షలు, 120 గజాల ప్లాటు ఇచ్చి న్యాయం చేస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో దుద్యాల మండలం లగచర్ల రైతులు కలెక్టర్‌తో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి రైతుల సమ్మతి లభించిందని కలెక్టర్ తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామన్నారు.
Similar News
News February 13, 2025
ఇలాంటి డాక్టర్లు చాలా అరుదు!

వైద్యాన్ని వ్యాపారం చేసిన ఈ రోజుల్లో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఎంతో మందికి పునర్జన్మనిచ్చారు వారణాసికి చెందిన డా.తపన్ కుమార్ లాహిరి. 2003లోనే ఆయన రిటైర్ అయినప్పటికీ 83 ఏళ్ల వయసులోనూ రోగులకు సేవలందిస్తున్నారు. 1994 నుంచి తన జీతం మొత్తాన్ని నిరుపేదల కోసం విరాళంగా ఇచ్చి పెన్షన్‌తో జీవిస్తున్నారు. రోజూ ఉదయం గొడుగు పట్టుకొని నడుస్తూ క్లినిక్‌కు వెళ్తుంటారు. ఆయనను 2016లో పద్మశ్రీ వరించింది.
News February 13, 2025
స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఇంట విషాదం

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్, ఖేల్ రత్న పురస్కార గ్రహీత మనికా బత్రా ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గిరీశ్ బత్రా(65) కార్డియాక్ అరెస్ట్‌తో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న మనికా సహచరులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ SMలో పోస్టులు పెడుతున్నారు.
News February 13, 2025
వక్ఫ్ బిల్లుపై JPC నివేదికకు రాజ్యసభ ఆమోదం

వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(JPC) నివేదికకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల నిరసన మధ్యే కేంద్రం ఆమోదం తెలిపింది. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం JPC ఇటీవల సవరణ బిల్లు నివేదికను ఆమోదించింది. కాగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే ఇది ముస్లింల హక్కులపై దాడేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.