News March 8, 2025
దుద్యాల: ఇప్పటికే రూ. 46.20 కోట్లు అందుకున్న రైతులు !

దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి, రోటిబండ, హకీంపేట, పులిచర్లలో కారిడార్ నిర్మాణం కోసం 233ఎకరాల భూమిని రేవంత్ ప్రభుత్వం సేకరించింది. దీంతో రైతులకు పరిహారంగా మొత్తం రూ.46.20కోట్లు అందించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒకవైపు రైతుల్లో ఆనందం మరోవైపు అధికారులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు స్టే విధించినప్పటికీ శుక్రవారం రోజు అధికారులు మళ్లీ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
Similar News
News January 14, 2026
నేడే జ్యోతి దర్శనం.. కిక్కిరిసిన శబరిగిరులు

అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్షకు ఇవాళ సార్థకత లభించనుంది. సాయంత్రం శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. 6.25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని స్వాముల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు మాలధారులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
News January 14, 2026
పతంగ్‌కు పక్కా ప్లాన్.. చెరువు వద్ల కుర్రాళ్ల చిల్ అవుట్!

డాబాల మీద డీజే గోల, పతంగుల కోసం కొట్లాటలకు ఈ తరం కుర్రాళ్లు గుడ్ బై చెప్పేస్తున్నారు. నెక్లెస్ రోడ్, గండిపేట లాంటి చెరువు గట్లనే తమ పతంగ్ అడ్డాగా మార్చుకుంటున్నారు. తెల్లవారుజామునే చాయ్ థర్మోస్, ఫోల్డబుల్ కైట్స్, మ్యూజిక్ కోసం చిన్న బ్లూటూత్ స్పీకర్‌తో అక్కడ వాలిపోతున్నారు. రొటీన్ రచ్చకు దూరంగా, ప్రశాంతమైన గాలిలో గాలిపటాలు ఎగరేస్తూ సరికొత్త ‘యాంటీ నాయిస్’ కల్చర్‌కు తెరలేపుతున్నారు. మీకూ నచ్చిందా?
News January 14, 2026
చిత్తూరు జిల్లాలో 62 బస్సులకు జరిమానా

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు డీటీసీ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఐదు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో అధిక ఛార్జీలు వసూలు చేసిన 30 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. రూ.3 లక్షల మేర జరిమానా విధించినట్లు చెప్పారు. పన్ను చెల్లించని, పర్మిట్ లేని 32 బస్సులను గుర్తించి రూ.2 లక్షల మేరకు జరిమానా వసూళ్లు చేశామన్నారు.


