News September 23, 2024

దుద్యాల: రాష్ట్రస్థాయి సత్తాచాటిన హస్నాబాద్ వాసి

image

దుద్యాలలోని హస్నాబాద్‌కు చెందిన సాయికిరణ్ రాష్ట్రస్థాయి షార్ట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న సాయికిరణ్ 6KG షార్ట్ పుట్‌ను 16.21m దూరం విసిరి రాష్ట్రంలోనే మొదటి స్థానం నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించిన సాయికిరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.

Similar News

News October 7, 2024

అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం

image

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదివారం అమెరికాలో ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసీ నగరానికి చేరుకున్న మంత్రికి పలువురు ఎన్నారైలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. 

News October 6, 2024

అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ: కామ్రేడ్ తమ్మినేని

image

అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆమె సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష్యసాధన కోసం చేయవలసిన కృషిని అనుక్షణం గుర్తు చేసే ఆదర్శ జీవితం కామ్రేడ్ లక్ష్మీదేవమ్మది కొనియాడారు. కామ్రేడ్ అరుణ్, జబ్బార్ ఉన్నారు.

News October 6, 2024

MBNR: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు

image

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా పాలమూరు జిల్లాలోని గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ – మల్లు నరసింహారెడ్డి, నాగర్ కర్నూల్ – జి. రాజేందర్, వనపర్తి – జి. గోవర్ధన్, గద్వాల- నీలి శ్రీనివాసులు, నారాయణ్‌పేట్-వరాల విజయ్ కుమార్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌గా నియమించింది.