News April 16, 2025
దుబాయిలో రామారెడ్డి వాసి మృతి

దుబాయ్లో వలస కార్మికుడి మృతి చెందాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్కి చెందిన బట్టు సురేశ్ దుబాయిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఈ నెల 12న మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దుబాయ్లో ఉన్న బట్టు శంకర్, నవీన్ ఎంబసీ ద్వారా మాట్లాడి మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామానికి పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
Similar News
News November 28, 2025
ఖమ్మం: వరి కొయ్యలను కాల్చొద్దు.. కలియ దున్నాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు వరి కొయ్యలను తగులబెట్టడం మానుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి, పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు తెలిపారు. దానికి బదులుగా, వ్యర్థాలను పొలంలోనే కలియదున్నడం వంటి పద్ధతులను అనుసరించాలని కోరారు. దీని వల్ల మట్టిలో పోషకాలు పెరిగి, భూసారం మెరుగుపడుతుందని అధికారులు రైతులకు వివరించారు.
News November 28, 2025
RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.
News November 28, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బస్తాల పసుపు విక్రయాలు జరిగాయి. ఈ వేలంలో క్వింటాల్ పసుపు ధర రూ.12,900 పలికింది. కొమ్ముల రకం పసుపు కనిష్ఠ, గరిష్ఠ, మోడల్ ధరలు రూ.12,900గా ఒకే ధర పలకగా, కాయ రకం పసుపు కూడా అదే ధర పలికినట్లు యార్డు అధికారులు తెలిపారు.


