News February 24, 2025
దుబాయ్లో అనకాపల్లి ఎంపీ

దుబాయ్లో పాకిస్థాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తదితరులు గ్రౌండ్కు వెళ్లారు. ఐసీసీ ఛైర్మన్ జైషాతో కలిసి ఆయన మ్యాచ్ను వీక్షించారు. భారత్ ఘన విజయం సాధించడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. టీమిండియాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విరాట్ సెంచరీ అద్భుతమని కొనియాడారు.
Similar News
News November 11, 2025
రాజమండ్రి, కాకినాడ రైళ్లు రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 20న నాలుగు రైళ్లను రద్దు చేశారు. కాకినాడ పోర్ట్-విశాఖ(17267), విశాఖ-కాకినాడ పోర్ట్(17268), రాజమండ్రి-విశాఖ(67285), విశాఖ-రాజమండ్రి(67286) రైళ్లు ఆ తేదీన తిరగవు. ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.
News November 11, 2025
వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it
News November 11, 2025
ఈనెల 14న పీయూలో రెజ్లింగ్ ఎంపికలు

పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీలో పాల్గొనేందుకు రెజ్లింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ PD డా.వై. శ్రీనివాసులు ‘Way2News’తో తెలిపారు. ఈనెల 14న యోగ (స్త్రీ) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోగా ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్ తీసుకొని రావాలని, 13లోగా పేర్లు నమోదు చేసుకోవాలి, ప్రతి కళాశాల నుంచి ఐదుగురు పాల్గొనవచ్చని అన్నారు.


