News November 14, 2024
దుబాయ్‌లో అమ్ధాపూర్ వాసి మృతి

బోధన్ మండలంలోని అమ్ధాపూర్ గ్రామానికి చెందిన హరికృష్ణ (38) దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హరికృష్ణ గత నెల అక్టోబర్ 24వ తేదీన బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్టోబర్ 31న రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదంలో మరణించాడు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రానున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News February 24, 2026
NZB: అరైవ్ అలైవ్ వారోత్సవాలు.. విద్యార్థులకు అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణలో ముందస్తు అవగాహనే అత్యంత కీలకమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. అలైవ్ అరైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు అంబాసిడర్‌గా ఉండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News February 24, 2026
NZB: కలెక్టర్, సీపీతో రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ భేటీ

రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను భేటీ అయ్యారు. మైనార్టీ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయాలని, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మైనార్టీ విద్యాలయాల్లో పూర్తి స్థాయి అడ్మిషన్లు జరిగేలా చూడాలని, ప్రభుత్వ సదుపాయాలపై అవగాహన పెంచాలని పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి పాల్గొన్నారు.
News February 24, 2026
NZB: దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ

NZB జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీస్ కమీషనర్ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. మోపాల్ మండల పరిధిలోని కాల్పోల్, రుద్రూర్, ఆనంద్ నగర్, నగరంలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


