News April 7, 2025
దుబాయ్‌లో అయిలాపూర్ వాసి మృతి

కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్ గౌడ్ (55) ఆదివారం రాత్రి దుబాయ్‌లోని తన గదిలో గుండెపోటుతో మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్రీనివాస్ ఐదేళ్లుగా దుబాయ్‌లో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Similar News
News April 17, 2025
ADB: ‘మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మహిళా సంఘాల సభ్యులకు ఆడిట్ నిర్వహణ తదితరాంశాలపై శిక్షణ తరగతులను బుధవారం నిర్వహించారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్న మాట్లాడారు. మహిళా సంఘాల పుస్తకాలను పారదర్శకంగా ఆడిట్ నిర్వహిస్తూ వారి బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సూచించారు.
News April 17, 2025
ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడం నేరమా?: MLC కవిత

ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడమే నేరమా.. ఇది ప్రజా పాలనా? పోలీసుల పాలనా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైందని అడిగినందుకు భీంగల్ లో BRS పార్టీ కార్యకర్తలపై మంత్రి జూపల్లి కృష్ణారావు పోలీసులను ఉసిగొల్పి లాఠీచార్జి చేయించి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె డిమాండ్ చేశారు.
News April 17, 2025
కృష్ణా జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లాకు మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా 8 మందిని ప్రభుత్వం బుధవారం నియమించింది. వీరిలో 7 టీడీపీకి, 1 మాత్రమే జనసేనకు చెందడం ఆసక్తికర చర్చలకు దారి తీసింది. అధికార కూటమిలో భాగమైనా జనసేనకు తక్కువ ప్రాధాన్యం ఎందుకు కలిగిందన్న దానిపై రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చలు సాగుతోందన్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి అసలు ఏమి అవకాశం లభించలేదు. 2 పార్టీల సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.