News December 17, 2024
దుబాయ్లో ఉద్యోగాలు.. HYD వాసులకు అవకాశం

దుబాయ్లో డెలివరీ బాయ్ ఉద్యోగం చేసేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. HYDలోని ITI మల్లేపల్లి క్యాంపస్లో డిసెంబర్ 20న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఓవర్సీస్ మ్యాన్ పవర్ సంస్థ(TOMCOM) వెల్లడించింది. అర్హత: 10వ తరగతి పాస్, కనీసం 3 సంవత్సరాల ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్, 21-40 ఏళ్ల వయసు ఉండాలి.
మరిన్ని వివరాలకు https://tomcom.telangana.gov.in/ సంప్రదించండి.
SHARE IT
Similar News
News October 31, 2025
HYD సంస్థానం గురించి తెలుసా?

ప్రపంచప్రఖ్యాత HYD సంస్థానాన్ని 16 జిల్లాలుగా విభజించారు. తెలంగాణ 8, మరాఠ 5, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించారు. అనేక రాజవంశాల పాలనలో సుసంపన్నమైన ఈ సంస్థానాన్ని 1724లో మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్దిఖీ అసఫ్జాహీ వంశాన్ని స్థాపించి 224 ఏళ్లు పరిపాలించారు. కాలక్రమంలో వీరి అరాచకాలు ఢిల్లీకి చేరాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలతో ఇక్కడికి వచ్చి సంస్థానాన్ని భారతమాత ఒడిలో విలీనం చేశారు.
News October 31, 2025
జూబ్లీహిల్స్: రోజుకు 2 డివిజన్లలో సీఎం ప్రచారం

సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ప్రచారం సాగనుంది. PJR సర్కిల్ నుంచి జవహర్నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ (చాకలి ఐలమ్మ విగ్రహం) వరకు రోడ్ షో.సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్లో ప్రసంగం, సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా వద్ద మరో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు.
News October 31, 2025
డాక్టర్స్ స్పెషల్: ఎల్బీస్టేడియంలో టెన్నిస్ టోర్నమెంట్

ఎప్పుడూ రోగులు, వైద్యం అంటూ బిజీ బిజీగా ఉండే వైద్యులు ఈ వీకెండ్ సేదతీరనున్నారు. టెన్నిస్ టోర్నమెంటులో పాల్గొని రిలాక్స్ కానున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు డాక్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డా.అర్జున్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు సందడి చేయనున్నారు.


