News March 4, 2025

దుబాయ్‌లో కామారెడ్డి జిల్లా వాసి మృతి

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నరేశ్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న నరేశ్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఫిబ్రవరి 24 నరేశ్ సూసైడ్ చేసుకున్నాడు. కాగా ఇవాళ ఉదయం డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది. నరేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 4, 2025

రోహిత్, గిల్ ఔట్

image

ఛాంపియన్స్ ట్రోఫీ: టీమ్ ఇండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(28), గిల్ (8) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43/2గా ఉంది. విరాట్ (5*), శ్రేయస్ అయ్యర్ (0*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 42 ఓవర్లలో 222 రన్స్ కావాలి.

News March 4, 2025

MROలపై చర్యలు తీసుకుంటాం: జేసీ

image

అల్లూరి జిల్లాలో మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జేసీ అభిషేక్ గౌడ ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో స్వీరించిన ఫిర్యాదులు, భూ సమస్యల పరిష్కారం, రైతుల రిజిస్ట్రేషన్, భూ సర్వే, మ్యుటేషన్లపై కలెక్టరేట్‌లో మంగళవారం వీసీ నిర్వహించారు. భూముల సర్వేకు సహకరించని సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్లకు సూచించారు. MROలు ఆఫీసులకు రావడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News March 4, 2025

VZM: ఇంటర్ పరీక్షకు 922 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షను 22,114 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 21,192 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ మజ్జి ఆదినారాయణ తెలిపారు. మొత్తం 922 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 90 మంది ఇన్విజిలేటర్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.

error: Content is protected !!