News January 23, 2025
దుబాయ్‌లో మల్యాల వాసి ఉరివేసుకుని ఆత్మహత్య

మల్యాల కేంద్రానికి చెందిన బోగ సాయి (25) అనే యువకుడు దుబాయ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం యథావిధిగా పనికి వెళ్లిన సాయి ఈ రోజు వరకు తిరిగి రాకపోవడంతో అతని కంపెనీ వారు వెతకగా.. దుబాయ్‌లోని అల్కుస్ ప్రాంతంలోని హోర్డింగ్ టవర్ కు ఉరి వేసుకున్నట్లు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సాయి 3 నెలల క్రితమే దుబాయ్ వెళ్లి ఇలా ఆత్మహత్యకు పాల్పడడంతో మల్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 8, 2025
HYD: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022 పెన్షన్ కోసం పలువురు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక పేరు మంజూరు కావడం కాప్రా మున్సిపల్ కార్యాలయంలో చర్చనియాంశంగా మారింది.
News February 8, 2025
ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.
News February 8, 2025
ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.