News February 14, 2025

దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడు MISSING

image

దుబాయ్ దేశంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన జెల్లబాల శంకర్(30) ఈనెల 6వ తారీఖున బ్రతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మరుసటి రోజు సోనాపూర్ క్యాంపు నుంచి బయటకు వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

Similar News

News October 30, 2025

2020 ఢిల్లీ అల్లర్లు: పోలీసుల అఫిడవిట్‌లో సంచలన విషయాలు

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు CAA వ్యతిరేక నిరసనల పేరుతో అల్లర్లు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఖలీద్, ఇమామ్, హైదర్ తదితరుల బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించారని అందులో పేర్కొన్నారు.

News October 30, 2025

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి: డీఈవో

image

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం ఎంఈవో శివప్రసాద్‌తో కలిసి ఉండవెల్లి మండలం బొంకూరులో ఎస్‌ఏ-1 పరీక్షల ప్రక్రియను ఆమె పరిశీలించారు. విద్యార్థులను ఇప్పటి నుంచే పరీక్షలకు సంసిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఎఫ్‌ఏ-1, 2 మార్కుల జాబితా నమోదు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

News October 30, 2025

ట్రైనింగ్ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ జితేష్

image

ఫర్నిచర్ అసిస్టెంట్ 3 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా యువతకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. నవంబర్ 6న కలెక్టరేట్‌లో డ్రాయింగ్‌పై టెస్ట్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువత ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్‌స్టలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో నైపుణ్యం సాధించి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆయన చెప్పారు.