News August 1, 2024
దుబాయ్‌లో సిరిసిల్ల వాసి మృతి

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన చంద్రకాంత్ అనే గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో అబుదాబిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతనెల 29న మృతి చెందాడు. అయితే 1992 నుంచి దుబాయ్ వెళ్తున్న చంద్రకాంత్.. మరణం చెందటం పట్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈనెల 2న మృతదేహం స్వగ్రామానికి చేరనున్నట్లు సమాచారం.
Similar News
News January 20, 2026
కరీంనగర్: ప్రయోగశాలల సామగ్రికి టెండర్ల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగ సామగ్రి పంపిణీ కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఐఈఓ వి.గంగాధర్ తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం, ఫిబ్రవరి 2 నుంచి జరిగే ప్రయోగ పరీక్షల నిమిత్తం ఈ ప్రక్రియ చేపట్టారు. ఆసక్తి గల పంపిణీదారులు పద్మనగర్‌లోని డీఐఈఓ కార్యాలయంలో సంప్రదించి కొటేషన్లు సమర్పించాలన్నారు.
News January 20, 2026
KNR: ‘విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు చెల్లించాలి’

విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ త్వరితగతిన చెల్లించాలని ఎస్టీయూ నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజును కోరారు. ఈమేరకు సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్‌కుమార్ డీటీఓను కలిసి విన్నవించారు. అలాగే కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బంది డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని వారు కోరారు.
News January 19, 2026
కరీంనగర్: ‘కార్టూన్.. సమాజాన్ని ప్రశ్నించే అస్త్రం’

సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి కార్టూన్ ఒక శక్తివంతమైన మాధ్యమమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. సోమవారం ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణను ఆమె ప్రారంభించారు. వేగవంతమైన ఈ ప్రపంచంలో తక్కువ సమయంలోనే లోతైన ప్రభావం చూపే శక్తి కార్టూన్లకు ఉందని, విద్యార్థులు ఈ కళను నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.


