News February 27, 2025

దుబ్బరాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

image

సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ గ్రామంలో కొలువైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడెమొక్కులు, కుంపటి గజాశూలం మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News February 28, 2026

హైదరాబాద్‌లో ఇక ఒకే చట్టం: సీఎం ఆదేశాలు

image

ఓఆర్ఆర్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఒకే చట్టం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై సీఎం సమీక్షించారు. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపకల్పన చేసి, అనుమతులు, అభివృద్ధి పనులన్నీ కోర్ అర్బన్ చట్టం ఆధారంగా నిర్వహించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని శాఖల రోడ్లను MAUD పరిధిలోకి తేవాలని చెప్పారు.

News February 28, 2026

నల్గొండ: ఆయిల్‌పామ్‌ రైతులకు ‘రాయితీ’ సెగ

image

ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు రాయితీల జాప్యం శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 22 వేల ఎకరాలకు పైగా సాగు జరుగుతుండగా, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం సకాలంలో అందడం లేదు. ఏటా ఎకరానికి రూ.16,800 చొప్పున నాలుగేళ్ల పాటు ఇవ్వాల్సిన సబ్సిడీ నెలల తరబడి ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 28, 2026

విశాఖలో నేటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్

image

విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ‘టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (TCCL) ప్రారంభం కానుంది. సినీ నటులు శ్రీకాంత్, తరుణ్ నేతృత్వంలో సుమారు 110 మంది సినీ, టీవీ ప్రముఖులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. పేద విద్యార్థుల చదువులకు చేయూతనిచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.