News April 11, 2025

దుబ్బాక: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక మండలం రాజక్క పేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన బోయ మోహన్ (48)రేకులకుంట ఆలయంలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆలయ సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News September 19, 2025

23 రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (<>కోల్‌కతా<<>>) 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌తో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 3.

News September 19, 2025

రూ.25వేల వరకూ స్కాలర్‌షిప్.. అప్లై ఇలా!

image

కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మిక పిల్లలకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. 2025-26AYకి సంబంధించి ప్రస్తుతం ఆన్‌లైన్ <>దరఖాస్తులు<<>> తీసుకుంటోంది. 1-10 తరగతుల వారు ఈ నెల 30లోపు, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారు అక్టోబర్ 31లోపు అప్లై చేసుకోవచ్చు. 1-4 తరగతుల వారికి ఏడాదికి ₹1000, 5th-8th ₹1,500, 9th, 10thకు ₹2K, ఇంటర్‌కు ₹3K, డిగ్రీ, ITI, ఇతర కోర్సులకు ₹6K, B.Tech తదితర కోర్సులకు ₹25K ఇవ్వనుంది.

News September 19, 2025

సిరిసిల్ల కలెక్టర్‌కు ప్రభుత్వం నోటీసులు..!

image

ప్రజాపాలన దినోత్సవం వేళ జెండావిష్కరణ సమయానికి రాకుండా SRCL కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రొటోకాల్ పాటించలేదని <<17746715>>MLA ఆది ఆయనపై<<>> సీరియసైన విషయం తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) K.రామకృష్ణారావు కలెక్టర్‌కు సంజాయిషీ నోటీసులు పంపారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలలోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.