News September 10, 2024

దుబ్బాక: ఆస్తి విషయంలో తండ్రితో గొడవ.. కొడుకు సూసైడ్

image

దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవపడి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమి పంపకం చేయాలని తండ్రి వెంకయ్యతో కొడుకు గంట బాలయ్య(39) 3న గొడవపడ్డాడు. పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని తండ్రి చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు గుళికలు మింగాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.

Similar News

News October 7, 2024

సీఎం సంపూర్ణ రుణమాఫీ వ్యాఖ్యలు ఓ బూటకం: హరీశ్ రావు

image

సంపూర్ణ రుణమాఫీ చేశారని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్తూ రేవంత్ రెడ్డి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. ఎస్బీఐ బ్యాంకులోనే 5,06,494 మంది అంటే దాదాపు 50% మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదని ఆధారాలతో బయటపెట్టారు.

News October 7, 2024

MDK: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు

image

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.

News October 6, 2024