News March 10, 2025

దుబ్బాక: కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

image

రోడ్డు ప్రమాదంలో <<15703438>>యువకుడు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిందన్న సంతోషంలో వెళ్తున్న యువకుడి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల వివరాలిలా.. పోతారం వాసి నరేశ్(28)కు నెల క్రితం కూతురు పుట్టింది. కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌లోని అత్తగారింట్లో ఉన్న భార్య, పాపను తీసుకురావడానికి ఆదివారం బైక్‌పై వెళ్తున్నాడు. ఆకారం శివారులో ఆటో ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News November 27, 2025

అమరావతి: ‘రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సహకరిస్తాం’

image

CM చంద్రబాబుతో సమావేశం సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడారు. రాజధాని కోసం JACలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించామని, ఇక అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటామన్నారు. 2వ విడత భూసమీకరణకు పూర్తిగా సహకరిస్తామని, CM రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తమకు మేలు జరుగుతుందని, ల్యాండ్ పోలింగ్‌కు ఇవ్వని వారిని పిలిపించి మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు.

News November 27, 2025

సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు 245 నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచి స్థానాలకు 207 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 1,442 వార్డులకు 38 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ తెలిపారు.

News November 27, 2025

కామారెడ్డి జిల్లాలో తొలిరోజు 210 నామినేషన్లు

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీల్లో (1,520 వార్డులకు) ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచి స్థానాలకు 115 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 95 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రాలేదు.