News March 26, 2025

దుబ్బాక: గురుకుల పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

image

దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ దుబ్బాక ఎంపీడీవో భాస్కర శర్మతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి మాట్లాడారు. విద్యార్థులు మంచి ఆహారం అందించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు.

Similar News

News December 3, 2025

‘ఆయుష్మాన్ భారత్’ పరిధిని విస్తరించాలి: MP పురందేశ్వరి

image

ఆయుష్మాన్ భారత్ పరిధిని విస్తరించాలని రాజమండ్రి MP దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈరోజు ఆమె పార్లమెంట్‌లో ముఖ్యమైన అంశం కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీర్ఘకాలిక, సాధారణ వ్యాధుల కోసం అవసరమైన ఓపీడీ సేవలను పథకం పరిధిలో తక్షణమే చేర్చాలని, ఆసుపత్రి అనంతరం ఔషధాల కవరేజిని 15 రోజుల పరిమితిని విస్తరించి లబ్ధిదారులపై పడుతున్న అదనపు ఖర్చులను గణనీయంగా తగ్గించాలని ఆమె కోరారు.

News December 3, 2025

పసలపూడి వాసికి ‘కర్మ వీర్ చక్ర’ అవార్డు

image

ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన యువర్స్ బిసర్వేంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు చీపుళ్ళ విజయ్‌కు ‘కర్మ వీర్ చక్ర’ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి సహకారంతో వివిధ సేవా కార్యక్రమాల్లో అందించే సేవలకు ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో అవార్డులు అందిస్తారు. విజయ్ తన ఆర్గనైజేషన్ ద్వారా 50వేల మందికిపైగా బ్లడ్, లక్ష మందికి పైగా ఆహారం, వీల్ ఛైర్స్ అందజేత కార్యక్రమాలకు గానూ.. న్యూఢిల్లీలో అవార్డు అందుకున్నారు.

News December 3, 2025

స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన వద్దు: DMHO

image

ఎన్టీఆర్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని DMHO సుహాసిని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. సుత్సుగమూషి అనే కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, కుట్టిన చోట ఎర్రటి మచ్చ కనిపిస్తుందని వివరించారు. పొలాలు, తోటలకు వెళ్లేటప్పుడు పొడవు చేతుల బట్టలు ధరించాలని ఆమె సూచించారు.