News November 5, 2024

దుబ్బాక: చెట్టుకు ఢీకొన్న స్కూల్ పిల్లల ఆటో

image

దుబ్బాక మండలం పెద్ద చీకొడు గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన పిల్లలతో దుబ్బాకకు వెళ్తున్న ఆటో చికోడు వద్ద చెట్టుకు ఢీ కొట్టింది. ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయాలు కాగా దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని సిద్దిపేట ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

Similar News

News October 31, 2025

తూప్రాన్: మళ్లీ కనిపించిన పులి

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి మళ్లీ శుక్రవారం కనిపించింది. మల్కాపూర్ – దాతర్ పల్లి మార్గమధ్యలో గుండుపై సేద తీరుతూ శుక్రవారం ఉదయం కనిపించింది. బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ పులి కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News October 31, 2025

నర్సాపూర్ అర్బన్ పార్కులో రేపు కాటేజీలు ప్రారంభం

image

మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని రూ. 20 కోట్లతో ఏర్పాటు చేసిన నర్సాపూర్ అర్బన్ పార్కులో నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ కాటేజీలను శనివారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొంటారు. ఈ ప్రారంభంతో సందర్శకుల రద్దీ, రాత్రి బస చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

News October 30, 2025

మెదక్: రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

image

ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలి ఘనపూర్ మండలం శాలిపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.