News September 15, 2024
దుబ్బాక: చెరువులో పడి బాలుడి మృతి

దుబ్బాక మండలం అప్పనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన బండి నవీన పిల్లలతో కలిసి అప్పనపల్లి తల్లిగారింటికి వచ్చింది. తల్లి రేణుక, మరదలు కావ్య, కుమారుడు సాయి (7)తో కలిసి నవీన చెరువు వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. చెరువు కట్టపై ఆడుకుంటున్న సాయి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News November 18, 2025
మెదక్: ‘పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి’

టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్ల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనడం ఉపాధ్యాయులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుందన్నారు. 25, 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ రాసి పాస్ కావడం అంటే చాలా శ్రమ, వేదనతో కూడుకున్నదన్నారు.
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <