News August 31, 2024
దుబ్బాక: పుట్టిన రోజునే.. కొడుకు కళ్లముందే తల్లి ఆత్మహత్య
దుబ్బాక మండలం గంభీర్పూర్‌లో రవళి(25) పుట్టిన రోజునే కొడుకు కళ్ళేదుటే ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం భర్త సాగర్ రెడ్డి ఉద్యోగానికి వెళ్లగా, మామ బయటకు వెళ్లాడు. పెద్ద కుమారుడిని అంగన్వాడీ కేంద్రానికి పంపి అనంతరం రెండేళ్ల కుమారుడి ముందు ఉరేసుకుంది. తల్లి చీరను పట్టుకొని బాలుడు ఏడవడంతో స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News September 17, 2024
MDK: ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్
కౌడిపల్లి ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కౌడిపల్లి ఆస్పత్రిని నేడు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. సిబ్బంది రమేష్, రాధాకృష్ణ, అహ్మద్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధుల్లో లేకపోవడంతో ఆ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ డా. శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
News September 17, 2024
సంగారెడ్డి: 1200 మంది పోలీసులతో బందోబస్తు
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 17న జరిగే వినాయక నిమజ్జనానికి 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ సోమవారం తెలిపారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
News September 16, 2024
సంగారెడ్డి: రికార్డు ధర పలికిన గణపతి లడ్డూలు
వాడవాడలా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. కానుగుంటలో శ్రీఏకశిలా వరసద్ధి వినయాక దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం లడ్డూ వేలం పాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.2.02 లక్షలు పలికింది. గోవర్ధన్ రెడ్డి లడ్డూని దక్కించుకోగా.. మరో లడ్డూను రూ. 80 వేలకు విశాల్ గౌడ్ దక్కించుకున్నారు.