News September 18, 2024

దుబ్బాక వస్త్రాలంకరణలో అయోధ్య బాల రాముడు

image

అయోధ్య బాలరాముడిని సిద్దిపేట చేనేత వస్త్రాలతో మనోహరంగా అలంకరించారు. దుబ్బాకలోని హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ తయారు చేసిన చేనేత వస్ర్తాలతో నిన్న బాల రాముడు మెరిసిపోయారు. చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్‌ తెలిపారు.

Similar News

News October 6, 2024

MDK: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు

image

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.

News October 6, 2024

సంగారెడ్డి: రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు

image

సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతులకు సంబంధించిన ఖాతాలలో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను వ్యవసాయ పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

News October 6, 2024

దసరాకు ముస్తాబైన జ్వాలాముఖి ఆలయం

image

కంగ్టి మండలంఎడ్ల రేగడి తండాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దసరా పండుగకు ముస్తాబు చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి శ్రీ మంగళ్ చంద్ మహారాజ్ తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం జ్వాలాముఖి దేవికి హోమం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.