News February 13, 2026

దుబ్బాక: సమాన ఓట్లు.. టాస్‌లో గెలుపు

image

దుబ్బాక మున్సిపాలిటీలోని మూడో వార్డులో హోరాహోరీగా సాగిన పోరులో విజయం బీఆర్ఎస్‌ను వరించింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి శ్రీలత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికీ సమానమైన ఓట్లు రావడంతో ఫలితం టైగా నమోదయింది. తిరిగి లెక్కించినా అంతే రావడంతో టాస్ వేశారు. టాస్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు.

Similar News

News March 9, 2026

పి.గన్నవరం: గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

image

యానాం–ఎదురులంక వంతెనపై సోమవారం ఉదయం ఓ మహిళ గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, అదే సమయంలో నదిలో చేపల వేట సాగిస్తున్న జాలర్లు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని నిలిపిన జాలర్లను స్థానికులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 9, 2026

HYD: 20 కిలోల టమాట రూ.60.. రైతుల ఆవేదన!

image

HYDలో టమాట ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో గత 3, 4 రోజులుగా టమాట ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాట క్రేట్ ధర కేవలం రూ.60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతోంది. సరఫరా ఎక్కువగా రావడం, వివాహాది శుభకార్యాలు ఇంకా మొదలవ్వకపోవడంతో వినియోగం తగ్గి ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 9, 2026

రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

image

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.