News February 25, 2026

దుబ్బాక: 400 ఏళ్ల కోనేరు పునరుద్ధరణ

image

దుబ్బాక మండలం ధర్మాజీపేటలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ కోనేరును గ్రామ యువత పునరుద్ధరించారు. వేద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన కోనేరును, ఆలయ పరిసరాలను యువకులు, పెద్దలు కలిసి ఉత్సాహంగా శుభ్రం చేశారు. మన సంస్కృతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ పునఃప్రక్షాళన చేపట్టామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుతారి సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Similar News

News April 15, 2026

లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

image

35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల డెలివరీలో కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా ప్రీవియా, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకముందే డెలివరీ కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పుట్టే బిడ్డల్లో కూడా డౌన్ సిండ్రోమ్, బిడ్డకు బీపీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెలివరీ దగ్గర పడే కొద్దీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 15, 2026

GNT: దొరకని రిమాండ్ ఖైదీ ఆచూకీ

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌) నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ పరారయ్యాడు. అనారోగ్య కారణాలతో రేపల్లె సబ్ జైలు నుంచి చికిత్స కోసం వచ్చిన ఇతడు, మూత్ర విసర్జన సాకుతో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఏలూరుకు చెందిన అజిత్‌పై గతంలో చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎస్కార్ట్ ఉండగానే ఖైదీ చెక్కేయడం పోలీసులకు సవాల్‌గా మారింది.

News April 15, 2026

బీట్‌రూట్‌తో హెల్తీ హెయిర్

image

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్‌రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.