News February 8, 2025
దుమ్మగూడెం : పురుగు మందు తాగి బాలిక మృతి

దుమ్మగూడెం మండల పరిధిలోని ధర్మవరం కొత్తగూడెంకి చెందిన ఓ మైనర్ బాలిక చదువు మధ్యలో మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు చదువుకోమని మందలిస్తుండేవారు. ఈ క్రమంలో గత నెల 26న ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నోటి నుంచి నురగతో పడిపొయి ఉంది. బాలికను ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది.
Similar News
News December 9, 2025
పల్నాడు: పొలిటికల్ ఫైట్.. చదలవాడ వర్సెస్ గోపిరెడ్డి

నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మధ్య రాజకీయ పోరు మొదలైంది. ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేస్తామని అరవింద్ బాబు ప్రకటించారు. లోపాలు లేకపోతే డాక్టర్ను ఎందుకు సస్పెండ్ చేశారని గోపిరెడ్డి ప్రశ్నించడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.
News December 9, 2025
నెల్లూరు: విద్యార్థులకు మరో అవకాశం.!

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ కే.సునీత తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఇంకా భర్తీ కాని సీట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు రాకపోయినా సీట్లు పొందే అవకాశం ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News December 9, 2025
నేడు ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించనున్న సీఎం

TG: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9 నుంచి ప్యానెల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. అటు గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఇవాళ రాత్రి డ్రోన్ ప్రదర్శన చేయనున్నారు. నిన్న భారీ ఎత్తున పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా ఇవాళ మరిన్ని కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం ఉంది.


