News March 22, 2025
దుమ్ముగూడెం: జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న సోయం సుకుమార్ (11) శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుకుమార్కు జ్వరం రావడంతో ఈనెల 15న తల్లిదండ్రులు హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. 17న సాయంత్రం జ్వరం తీవ్రత పెరిగి పిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News December 5, 2025
KNR: TALLY.. రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్లో TALLY ERP 9 విత్ GSTలో శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ల గడువును DEC 12 వరకు పొడిగించినట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కరీంనగర్ IT టవర్ మొదటి అంతస్తులోని TASK కార్యాలయంలో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. TALLY నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఇది సువర్ణవకాశమని అన్నారు. అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 5, 2025
మీరు ఇలాగే అనుకుంటున్నారా?

మనం అనేక వ్రతాలను ఆచరిస్తాం. ఏదో ఒక రోజున మన కోరిక నెరవేరినప్పుడు, అది చివరి సారి చేసిన వ్రత ఫలితమే అనుకుంటాము. ఆ ఒక్క వ్రతాన్నే గొప్పదని భావిస్తాము. అంతకుముందు చేసిన వ్రతాల శక్తిని తక్కువగా అంచనా వేస్తాము. కానీ, ఈ విజయం అన్ని వ్రతాల సంచిత ఫలితమని గ్రహించాలి. ఒక దుంగ నూరవ దెబ్బకు పగిలితే, అందుకు మొదటి 99 దెబ్బలు ఎలా కారణమవుతాయో మనం చేసిన చిన్న చిన్న వ్రతాల ఫలితాలు కూడా అంతే. ఏ వ్రతం చిన్నది కాదు.
News December 5, 2025
కృష్ణా: మెగా PTM-3.0 కార్యక్రమానికి సర్వం సిద్ధం

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 2500లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మెగా PTM-3.0 నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతిని తెలుసుకోనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారీ భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ గాంధీ హైస్కూల్కు దాతలు ఉచితంగా 6 లాప్టాప్లను అందించారు. జిల్లాలో ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


