News March 22, 2025
దుమ్ముగూడెం: జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న సోయం సుకుమార్ (11) శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుకుమార్‌కు జ్వరం రావడంతో ఈనెల 15న తల్లిదండ్రులు హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. 17న సాయంత్రం జ్వరం తీవ్రత పెరిగి పిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News April 18, 2025
నిర్మల్: మండలాలకు చేరుతున్న ఎన్నికల సామగ్రి

సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎలక్షన్లకు సామగ్రిని ఎంపీడీవో ఆఫీస్‌లకు చేరుకున్నాయి. గురువారం కుబీర్ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఎలక్షన్ సామగ్రిని ఎంపీడీవో నవనీత్ కుమార్, ఎంపీఓ మోహన్ సింగ్ పరిశీలించారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిద్ధంగా ఉంటామని, జీపీల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టులు సిద్ధంగా ఉంచామని ఎంపీడీవో తెలిపారు.
News April 18, 2025
నాగర్‌కర్నూల్: పోలీస్ కస్టడీకి గ్యాంగ్ రేప్ నిందితులు

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల మహిళపై ఏడుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన తెలిసిందే. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు గురువారం కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. ఊర్కొండపేట దేవాలయం సమీపంలో వారు గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
News April 18, 2025
వనపర్తి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ఏప్రిల్ 30 నాటికి ఎల్ఆర్ఎస్ గడువు ముగుస్తున్నందున కచ్చా లేఅవుట్, ప్లాట్లు రెగ్యులరైజ్ చేయించుకునే విధంగా మున్సిపల్ అధికారులు కృషి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గడువులోగా అత్యధిక శాతం కచ్చా లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధికరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.