News September 11, 2024
దుమ్ముగూడెం: తూరుబాక ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్

దుమ్ముగూడెం మండలం తూరుబాక ప్రధాన రహదారిపై బుధవారం గోదావరి వరద నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద అధికారులు రాకపోకలను నిలిపివేశారు. గోదారి నీరు చేరిన రహదారులను దాటే ప్రయత్నం చేసి ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు సూచించారు.
Similar News
News November 16, 2025
స్థిరాస్తి లాటరీల మోసం.. అధికారులు దృష్టి సారించాలి

ఖమ్మం జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘1000 కట్టు-ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత ప్రకటనలతో లాటరీలు నిర్వహిస్తూ ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆర్థిక మోసాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అమాయక ప్రజలను ఈ మోసాల నుంచి రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
News November 16, 2025
ఖమ్మం: అంగన్వాడీల్లో కనిపించని సమయపాలన..

జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బదులు ఆలస్యంగా కేంద్రాన్ని తెరవడం, అలాగే సాయంత్రం 4 గంటలకు ముందే 3 గంటలకే ఇంటికి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ వెంటనే దృష్టి సారించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News November 16, 2025
ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు: సీపీ

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CP సునీల్ దత్ అన్నారు. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇమెయిల్ ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో చేసి డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పలు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఎవరైనా వీడియో కాల్, వాట్సాప్, మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేసి పిర్యాదు చేయాలన్నారు.


