News April 16, 2025
దుమ్ముగూడెం: మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు

ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. గోవిందపురం, పెద్ద బండి రేవు, చిన్ననలబల్లి, ములకపాడు, లక్ష్మీనగరం ప్రధాన సెంటర్లలో వెలసిన కరపత్రాలలో గిరిజనులకు ఆధారమైన అడవిలోకి వెళ్లకుండా మావోయిస్టులు బాంబులు అమర్చడం సరైన పద్ధతి కాదని ఎంతకాలం ఈ అరాచకాలు, మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వరా అంటూ ప్రశ్నిస్తూ కరపత్రాలలో పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్‌ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.
News November 27, 2025
జనగాం: ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికల విధులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలపై అధికారులకు శిక్షణ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మధురిషా తదితరులు పాల్గొన్నారు.
News November 27, 2025
జగిత్యాల: ఎయిడ్స్ డే ప్రోగ్రామ్స్‌కు ప్రత్యేక ప్రణాళిక

డిసెంబర్ 1న నిర్వహించనున్న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై బుధవారం జగిత్యాల డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఎయిడ్స్‌పై అవగాహన పెంచేందుకు పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ర్యాలీలు, శిబిరాలు నిర్వహించాలని సూచించారు.


