News February 12, 2025
దుమ్ముగూడెం ముత్యాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

దుమ్ముగూడెం గ్రామంలో తరతరాలుగా వెలిసిన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి 23వ ముగింపు జాతర ఉత్సవాలకు మంగళవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పట్టుచీరతో అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో పాటు అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమ పూజ వంటి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
Similar News
News November 19, 2025
దివిసీమ జల ప్రళయానికి 48 ఏళ్లు

AP: దివిసీమ జల ప్రళయానికి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న కడలి ఉప్పొంగడంతో ఊళ్లు శవాల దిబ్బలుగా మారాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి తదితర ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎంతో మంది జల సమాధి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 14 వేల మందికిపైగా చనిపోయారు. ఘటన జరిగిన 3 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియకపోవడం అత్యంత బాధాకరం.
News November 19, 2025
వినాయకుడిని ఏ సమయంలో పూజించడం ఉత్తమం?

బుధవారం వినాయకుడి పూజలకు శ్రేష్ఠం. ఉదయంతో పోల్చితే సాయంత్ర పూజల వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం.. సంధ్యా సమయంలో స్వామివారిని పూజిస్తే మనలోని ప్రతికూల శక్తులన్నీ హరించుకుపోతాయి. కొబ్బరి నూనె దీపం వెలిగించి, 21 గరికెలు సమర్పించి, గణేశుడి పంచరత్న స్తోత్రాన్ని పఠిస్తే.. బుద్ధి చతురత, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
News November 19, 2025
డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం: ఎస్పీ

డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం అని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు పోలీసులు/సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి భయపెట్టడం, వివరాలు తీసుకుని డబ్బులు దోచుకోవడం వంటి కేసులు పెరుగుతున్నాయన్నారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ చేయరని, ఫోన్లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి లేదా Kurnool Cyber Policeను సంప్రదించాలన్నారు.


