News January 29, 2025
దుమ్మురేపుతున్న భద్రాచలం అమ్మాయి

గతేడాది U-19 ఆసియా కప్‌ను భారత్ గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించిన భద్రాచలం అమ్మాయి గొంగిడి త్రిష మహిళల అండర్ -19 ప్రపంచకప్ లో దుమ్ము రేపుతోంది. మంగళవారం స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇలానే ఆడితే టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికవడం ఖాయమని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 1, 2026
వల్లూరు: చంద్రగ్రహణం సందర్భంగా పుష్పగిరి ఆలయం మూసివేత

వల్లూరు (M) పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల మూడో తేదీన ఉదయం 6 గంటల నుంచి నాలుగో తేదీ ఉదయం ఏడున్నర వరకు తలుపులు మూసివేసి ఉంటుందని దేవాలయ ఈవో శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహ వచనం స్వామివారికి విశేష అభిషేకం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.
News March 1, 2026
పుష్పగిరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

వల్లూరు మండలం పుష్పగిరి నదిలో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు డ్యాం చూడటానికి వచ్చి సరదాగా నదిలో దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నదిలో కొట్టుకుపోయారు. అందులో సురేంద్ర(25) అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు శ్రీనాథ్, చైతన్యలు గల్లంతయ్యారు. శ్రీనాథ్ రైల్వే కొండాపురానికి చెందిన వ్యక్తిగా సురేంద్ర తెలిపారు. మృతదేహాల కోసం స్థానికులు గాలిస్తున్నారు.
News March 1, 2026
WGL: ఫైర్ స్టేషన్ల మొబైల్ నంబర్లు

1.హనుమకొండ: 87126 99304
2. వరంగల్ : 87126 99302
3. పరకాల : 87126 99306
4. నర్సంపేట : 87126 99308
5. వర్ధన్నపేట : 87126 99310
6. మహబూబాబాద్ : 87126 99314
7. డోర్నకల్ : 87126 95347
8. జనగాం : 87126 99346
9. పాలకుర్తి : 87126 99348
10. స్టేషన్ ఘనపూర్: 87126 95344
11. ములుగు: 87126 99210
12. భూపాలపల్లి: 87126 99208.


