News March 15, 2025
దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి అండగా ఉంటాం: పవన్ కళ్యాణ్

అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జన సైనికుడు అడపా దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘జనసేన సభ నుంచి వెళ్తూ దుర్గాప్రసాద్ చనిపోయారని తెలిసి చింతిస్తున్నా. అతని కుటుంబానికి జనసేన అన్ని విధాలా అండగా ఉంటుంది’ అని పవన్ అన్నారు. పిఠాపురంలో నిన్న దుర్గాప్రసాద్‌కు కళ్లు తిరగ్గా.. బస్సులో కూర్చోపెట్టారు. ఇంటికి వచ్చాక గుండెపోటుతో చనిపోయారని స్థానికులు తెలిపారు.
Similar News
News March 16, 2025
MHBD: మట్టి దారులు.. ఇక సీసీ రోడ్లు!

మహబూబాబాద్ జిల్లా సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 641 నూతన రోడ్ల నిర్మాణం కోసం 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.33.75 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా, ఈనెల 31 వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి చొరవతో 75% పల్లె రోడ్లు సీసీ రోడ్లుగా మారుతాయని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.
News March 16, 2025
పెంచికల్పేట్: వన్యప్రాణుల వేట.. నలుగురి అరెస్ట్

వన్యప్రాణుల వేటగాళ్లను శనివారం పెంచికల్పేట్ డీఆర్ఓ జమీర్ పట్టుకున్నట్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆగర్ గూడా అటవీలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అధికారులకు కొంతమంది అనుమానాస్పదంగా కనిపించినట్లు తెలిపారు. వారిని పట్టుకొని విచారించగా ఆగర్గూడా అటవీలో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చినట్లు నలుగురు అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు.
News March 16, 2025
బాచుపల్లి: ప్రజల ఆరోగ్యంతో ఆటలా?

కొన్ని పరిశ్రమలు విష వాయువులను వదులుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని బాచుపల్లి పరిసరప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొల్లారం, కాజేపల్లి, బొంతపల్లి, జిన్నారం, పాసి మైలారం తదితర పారిశ్రామికవాడలోని కొన్ని పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా శుద్ధి చేయకుండా విషవాయువులను విడుదల చేయడంతో ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.