News October 21, 2024

దుర్గాప్రసాద్ హత్య కేసు ఎందుకు మూసివేశారు: మంత్రి సుభాశ్

image

వాలంటీర్ అయినవిల్లి దుర్గాప్రసాద్ హత్యపై మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాలంటీర్ హత్యపై విశ్వరూప్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాలంటీర్ దుర్గాప్రసాద్ పినిపే శ్రీకాంత్ ప్రధాన అనుచరుడని మంత్రి వివరించారు.

Similar News

News February 9, 2026

ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకం: కలెక్టర్

image

ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఈ వారోత్సవాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ‘KYC – సురక్షిత బ్యాంకింగ్ దిశగా తొలి అడుగు’ అనే అంశంపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో అక్షరాస్యత కీలకమని పేర్కొన్నారు.

News February 9, 2026

నేరాల కట్టడికి ఎస్పీ కొత్త అస్త్రం.. జిల్లాలో “పల్లెనిద్ర” షురూ!

image

జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రకటించారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేస్తూ, క్షేత్రస్థాయిలో భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువస్తే, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

News February 8, 2026

రేపు ‘డయల్‌ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి ఎస్‌ఈ కె.తిలక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9 నుంచి ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు.