News August 20, 2024

దులీప్‌ ట్రోఫీ జరిగేది ఈ స్టేడియంలోనే!

image

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ పోటీలు అనంతపురంలో జరగనున్నాయి. వచ్చే నెల 5న టోర్నీ ప్రారంభం కానుండగా అనంతపురం ఆర్డీటీ క్రీడా గ్రామంలో 5 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆర్డీటీ క్రీడా గ్రామంలో రెండు గ్రౌండ్లు ఉన్నాయి. ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారి అతి పెద్ద ఈవెంట్‌ జరగనుండటంతో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Similar News

News July 5, 2025

గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

image

నార్పల మండలం గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం డీఎస్పీ వెంకటేశ్ శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, అగ్నిగుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు, అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కేటాయించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామని చెప్పారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.

News May 8, 2025

ATP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సూచించారు. AP విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. AP విపత్తుల సంస్థ SMSలు, RTGS నుంచి సూచనలను తెలుపుతున్నామన్నారు. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.

News May 8, 2025

పేదలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేయూత- కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 68,379 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు అనంతపురం కలెక్టర్ డా. వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమాజంలోని సంపన్న వర్గాల ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, పైస్థాయి ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నత స్థాయిలో ఉన్న 10% వ్యక్తులను గుర్తించి వారి ద్వారా దిగువ ఉన్న 20% కుటుంబాలకు సహాయం అందించేలా చర్యలు చేపడతామన్నారు.