News April 15, 2025
దువ్వాడ: రైలులో ప్రసవించిన మహిళ

చర్లపల్లి నుంచి కిసాన్ గంజ్ (07046) రైల్లులో ప్రయాణిస్తున్న మహిళ ఆదివారం అర్ధరాత్రి 12:30కు దువ్వాడ సమీపంలో ప్రసవించింది. రైలులో ఉన్న జైనాబ్కు పురిటి నొప్పులు రావడంతో రైల్వే సిబ్బంది గమనించి సత్వర చర్యలు చేపట్టారు. ఆమె రైలులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తక్షణమే తర్వాత స్టేషన్లో హాస్పిటల్కి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News November 9, 2025
మల్కాపురంలో యువకుడి మృతి

మల్కాపురంలోని ఓ బార్లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 8, 2025
విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.
News November 8, 2025
విశాఖ: నిర్మాణాల వద్ద వాలిపోతున్న చోటా నేతలు

సొంత ఇంటి నిర్మాణం మధ్యతరగతి కుటుంబాల కల. విశాఖలో కొందరు చోటా నాయకులు తమ ఆగడాలతో సామాన్యుల కలను చిదిమేస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే GVMCకి ఫీజులు చెల్లించి, టౌన్ ప్లానింగ్ అనుమతి తీసుకుంటే చాలు. కానీ ఈ నాయకులు ప్రజల నుంచి ముడుపులు వసూలు చేస్తుండటంతో.. ఈ వేధింపులు తాళలేక ఇటీవల ఓ ఇంటి యజమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. నగరంలో వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.


