News August 17, 2024
దువ్వాడ వాణికి 41ఏ నోటీసులు జారీ

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణీకి శనివారం టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులను జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ నివాసం ఆవరణలో నిరసన తెలుపుతున్న వాణీకి నోటీసులు అందజేసేందుకు టెక్కలి పోలీసులు వెళ్లారు. అయితే తానే స్వయంగా టెక్కలి పోలీస్ స్టేషన్కు వచ్చి నోటీసులు తీసుకుంటానని వాణి పోలీసులకు వివారించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో వాణిపై కేసు నమోదైన విషయం విధితమే.
Similar News
News November 27, 2025
SKLM: రేషన్ షాపుల్లో బియ్యానికి బదులు రాగులు పంపిణీ.!

జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈనెల 27 నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులకు డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా మూడు కిలోల వరకు ఉచితంగా రాగులు అందించాలన్నారు.

శ్రీకాకుళం: యాక్సిడెంట్..మృతుల వివరాలు ఇవే.!

పలాస మండలం గరుడఖండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు <<18406276>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలకాపు వేణుగా పోలీసు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు సుశాంత్ (23) ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్ ద్రమగిరి బ్లాక్ డేరా గ్రామానికి చెందిన యువకుడు అని తెలిపారు.