News December 10, 2024

దువ్వాడ శ్రీనివాస్‌పై ఒంగోలు PSలో ఫిర్యాదు

image

పవన్ కళ్యాణ్‌ని తమ రాజకీయ లబ్ధికోసం, జగన్ వద్ద మెప్పు పొందేందుకు అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నాయకులపై తగు చర్యలు తీసుకోవాలని, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేశ్, పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News January 18, 2025

SKLM: కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు చేరినవారు వీరే.!

image

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు ఎచ్చెర్ల పోలీస్ ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా పురుష అభ్యర్థులు 327 మంది దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు.

News January 18, 2025

శ్రీకాకుళం: జనసేన నాయకురాలు కాంతిశ్రీ మృతి

image

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతి శ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో గొలివి ఆసుపత్రిలో చేరిన ఆమె నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా ఈమె ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్థిక సహాయాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్థివదేహాన్ని సందర్శనార్థం 9 తర్వాత స్వగృహానికి తెస్తారని తెలిపారు.

News January 18, 2025

చంద్రబాబు మీటింగ్‌కి పలువురు మంత్రులు గైర్హాజరు

image

CM చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలో పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, MP గంటి హరీశ్, అంబికా లక్ష్మీ నారాయణలు గైర్హాజరయ్యారు. కమిటీ మీటింగులు, ఇతర పనులు పార్టీ మీటింగ్ కంటే ఎక్కువా? అని CM సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.