News January 27, 2025

దువ్వూరు హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా 

image

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల వివరాల ప్రకారం, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి దువ్వూరు ఎస్‌ఐ వినోద్, పోలీసులు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 26, 2026

కడప: ఓ ప్రభుత్వ అధికారి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?

image

జౌళి శాఖ అధికారులు <<19165873>>తన సంతకాన్ని, పేరును<<>> వాడుకొని అక్రమాలు చేశారని ఇరిగేషన్ అధికారి AEE గౌతమ్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. AEE ఫిర్యాదు చేసి 3 నెలలు గడుస్తున్నా తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. PGRSలో ఓ ప్రభుత్వ అధికారి చేసిన ఫిర్యాదుకే చర్యలు లేనపుడు, సామాన్య ప్రజల ఫిర్యాదులు ఎలా పరిష్కారం అవుతాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

News February 26, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,730
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,472
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.

News February 26, 2026

పులివెందుల సీఐ ఇంట్లో భారీగా నగదు

image

ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.