News January 27, 2025
దుశ్చర్లకు గవర్నర్ పురస్కారం

జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గౌడ్కు పర్యావరణ విభాగంలో గవర్నర్ ప్రతిభా పురస్కారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించారు. కాగా దుశ్చర్ల మోతె మండలం రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో అడవిని సృష్టించాడు. దుశ్చర్లకు అవార్డు రావడం పట్ల ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 17, 2025
ఎల్లుండి పుట్టపర్తికి ప్రధాని మోదీ

AP: శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా రేపు జరిగే రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి పుట్టపర్తిలోని హిల్వ్యూ స్టేడియంలో మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొంటారు. 20, 21 తేదీల్లో యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 23న అధికారిక శతజయంతి వేడుకలను నిర్వహిస్తారు.
News November 17, 2025
మెగాస్టార్ చిరంజీవి మన పల్నాడులో చదువుకున్నారని మీకు తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి మన పల్నాడులో విద్యాభ్యాసం చేశారు. చిరంజీవి తండ్రి వెంకట్రావు గురజాల ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేశారు. ఆ సమయంలో చిరంజీవి గురజాల దుగ్గరాజు వారి సందులోని కిష్టయ్య పాఠశాలలో వరప్రసాద్ పేరుతో చదువుకున్నారు. ఆయన గురజాలకు వచ్చినప్పుడు తాను చదువుకున్న పాఠశాలను, పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని గుర్తు చేసుకున్నారు.
News November 17, 2025
మేడారం జాతరకు భద్రాద్రి నుంచి ప్రత్యేక బస్సులు

జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహా జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని టీజీఆర్టీసీ యోచిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం కూడా ఈ జాతర సందర్భంగా అమలులో ఉండనుంది. తెలంగాణ ఆర్టీసీ ఈసారి మొత్తం 4,000 బస్సులను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.


