News October 11, 2024

దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: కలెక్టర్

image

చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్కరి కుటుంబానికి విజయాలు వరించాలన్నారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలను మంత్రి తెలిపారు.

Similar News

News November 3, 2024

ప్రగతికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేసుకోవాలి:

image

ఐదు నెలల కాలంలో జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ రాష్ట్ర రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి సత్య ప్రసాద్ జిల్లా అభివృద్ధి సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 3, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు పట్టణానికి చెందిన అంజిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

News November 2, 2024

రాష్ట్రస్థాయికి తాడిపత్రి విద్యార్థి అబ్బాస్ ఎంపిక

image

అనంతపురం జిల్లాస్థాయిలో జరిగిన సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో తాడిపత్రి విద్యార్థి అబ్బాస్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన పోటీల్లో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 9న గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పీఈటీ చంద్ర తెలిపారు. విద్యార్థి అబ్బాస్‌ను హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.