News September 29, 2024
దూసి: గాంధీ పర్యటించిన రైల్వే స్టేషన్లో స్థూపం ఏర్పాటు
దూసి రైల్వే స్టేషన్లో మహాత్మ గాంధీ స్మారక స్థలి ఏర్పాటు చేసేందుకు విశాఖ ఇంటాక్ట్ సంస్థ ప్రతినిధులు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఆ విషయమై పరిశీలించడానికి వచ్చామని సీనియర్ డీసీఎం ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజన్ అధికారి పవన్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం దూసి రైల్వే స్టేషన్ను పలువురు అధికారులతో కలిసి సందర్శించి మహాత్మ గాంధీ పర్యటించిన ప్రదేశాన్ని పరిశీలించారు. దూసి రైల్వే స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 17, 2024
SKLM: బ్యాంకులు భద్రత ప్రమాణాలు పాటించాలి: ఎస్పీ
బ్యాంకు సముదాయాలు, బ్యాంకులు, నగదు లావదేవీలు జరిగే (ATM) కేంద్రాలు వద్ద భద్రత ప్రమాణాలు పాటిస్తూ, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి బ్యాంకు అధికారులను సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి బ్యాంకు ప్రవేశ ద్వారం దగ్గర నియమించిన గార్డు అప్రమత్తంగా ఉండాలని, ఆయనకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
News November 16, 2024
పలాస: ఉరేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి
పలాస మండలం ఈదురాపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శాసనపురి నవ్య(30) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కాశీబుగ్గ సూదికొండ ప్రాంతంలోని ప్రభత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
News November 16, 2024
పైడి భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికలు వివరాల ప్రకారం.. బైక్-లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే పనిలో స్థానికులు ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.